- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రి వివరణ ఇవ్వాలి.. ఐఎంఏ డిమాండ్
by Shamantha N |
X
న్యూఢిల్లీ: పతంజలి కరోనిల్ టాబ్లెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ధ్రువీకరించిందని అబద్ధాలాడటం, ఆ ఔషధాన్ని విడుదల చేస్తున్న కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొనడం దారుణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే శక్తి కరోనిల్ ఔషధానికి ఉన్నదని పతంజలి వాదించింది. అయితే, ఈ ఔషధాన్ని తాము గుర్తించలేదని డబ్ల్యూహెచ్‌వో వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఐఎంఏ స్పందించింది.
దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్ధన్ ఒక అశాస్త్రీయ ఔషధ ఉత్పత్తిని దేశ ప్రజల కోసం విడుదల చేయడాన్ని ఏ విధంగా సరిపుచ్చుకుంటారని ప్రశ్నించింది. కరోనాను ఎదుర్కొనే ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు జరిగిందని? దాని టైమ్ ఫ్రేమ్ ఏమిటో వివరించాలని అడిగింది. దేశానికి ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరమున్నదని డిమాండ్ చేసింది.
Advertisement
Next Story