ఆయుర్వేద డాక్టర్లకు‘సర్జరీ’అనుమతి.. ఖండించిన IMA

by sudharani |
ఆయుర్వేద డాక్టర్లకు‘సర్జరీ’అనుమతి.. ఖండించిన IMA
X

దిశ, వెబ్‌డెస్క్ : సర్జరీ చేయడానికి పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసొసియేషన్ ఖండించింది. ఆయుర్వేదలో విధ్యనభ్యసించిన వారికి మోడ్రన్ మెడిసిన్ నైపుణ్యాలతో సర్జరీకి అనుమతించాలనుకోవడం సరికాదని అభిప్రాయపడింది. కంటి, ముక్కు, గొంతు సహా ఇతర సర్జరీలు చేయడానికి ఆయుర్వేద విద్యార్థులకు అనుమతినిచ్చే నోటిఫికేషన్‌ను సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ శుక్రవారం విడుదల చేసింది.

వెంటనే నోటిఫికషన్ సవరిస్తూ పీజీలో రెండు విభాగాల విద్యార్థులకు మాత్రమే అది కూడా 58 రకాల సర్జరీలకు మాత్రమే అవకాశముంటుందని తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఐఎంఏ ఖండిస్తూ, ‘ఆధునిక వైద్యాన్ని మరో విధానంతో కలగాపులగం చేయడం సరికాదు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసన్ పురాతన జ్ఞాన సంపద ఆధారంగా స్వతహాగా సర్జరీ నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవాలి. మాడ్రన్ మెడిసిన్‌లోని విధానాలను అనుకరించవద్దు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విధానాల్లో షార్ట్‌కట్‌లు కల్పిస్తే మాడ్రన్ మెడిసిన్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌కు అర్థమేముంటుంది? అంతేకాదు, సొంత అధ్యాపకులూ మాడ్రన్ మెడిసిన్‌ను బోధించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed