- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్సింగ్‌లో అక్రమ నిర్మాణాలు.. పట్టించుకునే నాథుడేలేడా..?
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలోనున్న నార్సింగ్ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాల పేరుతో ప్రజాప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ పాలకవర్గంలోని సభ్యులందరూ వైస్ చైర్మన్ కనుసన్నల్లో నడుస్తున్నారు. అయితే అక్కడి అధికారులు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండటంతో చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. నార్సింగ్ మున్సిపాలిటీలోని అత్యధిక ప్రాంతం 111 జీవో పరిధిలోని రెవెన్యూ కలదు. ఇలాంటి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు చేబుతున్నాయి. ఈ నిబంధనలకు తిలోదకాలు అద్దుతూ స్ధానిక మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అధికారులు వ్యవహారిస్తున్నారు. ఇక్కడ కూడా సాధారణ ప్రజలు నిర్మాణాలు చేపడితే కూల్చివేయడం, అదే పెద్ద పెద్ద రియల్ వ్యాపారులు, బిల్డర్లు నిర్మాణాలు చేపడితే ఏలాంటి చర్యలుండవ్. ఇదీ నార్సింగ్ మున్సిపాలిటీ పాలకవర్గం వ్యవహారం.
వీరికి జీవోలు వర్తించవా..?
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 237/పీలో 28 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి 111 జీవో పరిధిలోకి వస్తుంది. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ హిల్స్ నిర్మాణ సంస్థ లేఅవుట్ చేసింది. ఈ సంస్థపై సీపీఎం, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు స్ధానిక మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వట్టినాగులపల్లి ప్రాంతంలో ఇష్టానుసారంగా చేపడుతున్న నిర్మాణాలు కంటికి కనిపిస్తున్నా ఎందుకు వదిలేస్తున్నారని అధికారులను, కౌన్సిలర్లను నిలదీస్తే స్పందన లేదు. మూముళ్ల ముసుగుల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డులేకుండా వీరే వ్యవహరిస్తున్నట్లు స్ధానికులు ఆరోపిస్తున్నారు.
అయితే ఇందులో మున్సిపాలిటీ చైర్మన్ ఎస్సీ మహిళా కావడంతో వైస్ చైర్మన్ చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం సాగుతొంది. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఏలాంటి అక్రమమైనా సక్రమంగా చేసే నేత ఎదిగినట్లు చెబుతున్నారు. ఆ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్థులకు అనుమతినివ్వడం లాంటి బాధ్యతలన్ని ఆ వైస్ చైర్మన్ మీదుగానే నడిపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో 111 జీవోతో స్ధానిక మున్సిపాలిటీ అధికారులకు, కౌన్సిలర్లు తమకే సంబంధం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కానీ అక్రమంగా వసూళ్లు చేసుకోవడం తమ వంతుగా భావిస్తున్నారు.
ప్రభుత్వం నిఘా ఎందుకు లేదు…
రంగారెడ్డి జిల్లాలో అత్యంత విలువైన భూములున్న మున్సిపాలిటీల్లో ఒకటి నార్సింగ్. ఈ మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా భూములను స్వాధినం చేసుకొని నిబంధనలకు విరుద్దంగా కట్టడాలు నిర్మిస్తే చర్యలుండవ్. 111 జీవో ఎత్తివేతతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు. కానీ ఆ జీవో ఎత్తివేతలకు చర్యలు తీసుకోరు. అక్కడ మాత్రం నిబంధనలకు విరుద్దంగా రియల్ వ్యాపారులు చేస్తున్న వారికి మద్దతుగా నిలిచి నిర్మాణాలు చేయిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు మద్దతు ఇచ్చే బదులు… ఆ 111 జీవోను ఎత్తివేస్తే ప్రభుత్వానికి మున్సిపాలిటీ ద్వారా పెద్ద ఎత్తున్న ఆదాయం వస్తుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
ఇలాంటి ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం… పేదల భూములను అమ్మకాలకు పెట్టేందుకు మాత్రం త్వరితగతిన చర్యలు తీసుకుంటుంది. ఇదే 111 జీవోను నిబంధనలను ఉల్లఘించిన వారిపై చర్యలు కూడా తీసుకోకపోవడానికి కారణమేమిటి… స్ధానిక నాయకులు చేసే వసూళ్ల దందాల్లో పెద్దల హాస్తం ఉన్నట్లు చర్చ సాగుతుంది. ప్రజలకు ఇచ్చే హామీలు వేరు… వ్యక్తిగత పనుల కోసం ఆ హామీలుండవ్. ఇదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరీ. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడతున్న వారిపై, అందుకు మద్దతు తెలుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్ధానిక ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.