ఆ సెంటర్‌లలో అక్రమ సిట్టింగ్‌లు.. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ

by Shyam |   ( Updated:2021-11-20 22:59:42.0  )
ఆ సెంటర్‌లలో అక్రమ సిట్టింగ్‌లు.. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
X

దిశ, పరకాల: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పరకాల హుజరాబాద్ ప్రధాన రహదారిలో వెలసిన ఓ బిర్యాని సెంటర్ అక్రమ సిట్టిం‌గ్‌లు నిర్వహిస్తోంది. మంద్యం ప్రియులను ఆకర్షించి బిర్యాని, ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలు లక్ష్యంగా అక్రమ సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు శనివారం దిశ పత్రిక పరిశీలనకు వెళ్లగా పరకాల హుజురాబాద్ ప్రధాన రహదారిలో గల మణికంఠ రెస్టారెంట్ యజమాన్యం అక్రమ సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు కంట పడింది.

రెస్టారెంట్‌లోనే కాకుండా పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాం సమీపంలోగల పలు బిర్యాని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లలో సైతం అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతోనే అక్రమ సిట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రహదారులు హైవేలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు నిలిపివేసినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పలు బిర్యాని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్నా, నిఘా నేత్రం కొరవడడం అనేక విమర్శలకు తావిస్తోందిజ ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్రమ సిట్టింగ్‌ల పై నిఘా పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story