- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలను కావలుంచీ.. అడవిలో ఆకుల చాటున పాడుపని
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ కరకగూడెం మండలంలోని గోవిందపురం, పోట్లపల్లి ప్రాంతంలో పట్టపగలు తాటిఆకుల చాటున ఓ వ్యక్తి అక్రమంగా ఇసుకదందా చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అతను అధికారులను మచ్చిక చేసుకోవడం, మాటవినని అధికారిని అధికార పార్టీ నాయకులతో చెప్పించి, బెదిరించి ఇసుకదందా చేస్తున్నాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ నాదే…అందులో అంతా నావాళ్లే…
అతను ఇలా అక్రమ ఇసుక దందా చేస్తున్నా ఏ ఒక్క అధికారి నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అధికారులు ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే అధికార పార్టీ నాదే.. పార్టీలో అంతా నావాళ్లే.. అంటూ చెబుతున్నాడని ప్రజలు తెలిపారు. ఇలా అక్రమ ఇసుకదందా చేసుకుంటూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడని ప్రజలు అంటున్నారు. అధికార పార్టీలో కొంతమంది నాయకులు సపోర్ట్ చేయడం వల్లనే అతడి అక్రమ దందా కొనసాగుతోందని ప్రజలు చెబుతున్నారు.
అలా చేయడంలో దిట్టా..
ఇసుక ర్యాంపు ఫైల్స్ చేయడంలో సదరు వ్యక్తి దిట్టా అని మండల ప్రజలు చెబుతున్నారు. పినపాక మండలంలో సంబంధిత శాఖ అధికారికి 20% వాటా ఇస్తేనే ఇసుక ర్యాంపునకు అనుమతులు వస్తున్నాయనే ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారికి అతను భారీగా ముడుపులు అప్పజెప్పినట్లు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ ఇద్దరూ కలసి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇసుక ర్యాంపుతో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సదరు వ్యక్తిపై, అతనికి సహకరిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.