- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిక్కు తెచ్చిన ‘కిక్కు’?
దిశ, నిజామాబాద్: కరోనా కారణంగా జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మర్డర్లు, దొంగతనాలు, మోసాలు, యాక్సిడెంట్లు వంటివి లేవు. కానీ, మద్యం కారణంగా కొత్త పంచాయతీల(కేసులు)ను తెచ్చి పెట్టింది. దీంతో అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. పోలీస్, అబ్కారీ, వైద్య శాఖలలో మద్యం లొల్లితో కలకలం రేపుతోంది.
లాక్‌డౌన్ ప్రారంభమైనంక రెండు, మూడు రోజులకు..
ఎప్పుడూ లేని విధంగా మద్యం, తయారీ కల్లు దొరకక కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రలలో కోవిడ్-19 వార్డులతోపాటు అడిక్షన్ ఫ్రీ సెంటర్( ప్రత్యేక వార్డ్) లను ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి తీవ్రంగా కసరత్తు జరుగుతుంటే మరోవైపు కల్లు, మందు బాధితులకు వైద్యమందించడం ఆరోగ్య శాఖకు అదనపు భారంగా మారింది. వారు చేతులేత్తెసే దశలో కోవిడ్-19 విస్తరణ కారణంగా కృత్రిమ కల్లు తయారీని అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహారం సాగించడంతో కల్లు బాధితుల బాధలు తొలగిపోయాయి. కానీ, మద్యం బాధితుల గోడును పట్టించుకోకపోవడంతో పరిస్థితి అదుపు తప్పి మద్యం పంచాయతీలకు దారితీసింది.
లాక్‌డౌన్ విధించినంక అందరి పరిస్థితి ఒకలాగా.. మందు బాబుల పరిస్థితి మరోలా తయారైంది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండడంతో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. అబ్కారీ శాఖ కంటే ముందుగానే మద్యం వ్యాపారులు అప్రమత్తమై రాత్రికిరాత్రే మద్యం దుకాణాలను తెరిచి అందులో ఉన్న మద్యాన్ని దారి మళ్లించారు. ప్రతినెలా చివరి వరకూ అమ్మేవిధంగా స్టాక్ ఉంచుకునే మద్యం దుకాణాలు, బార్‌లలో మొత్తం స్టాక్‌ను ఖాళీ చేశారు. ఆ తరువాత తేరుకున్న అబ్కారీ శాఖ అధికారులు ఆ ఖాళీ దుకాణాలకు, బార్లకు సీల్ వేశారు.దారి మళ్లించిన మద్యాన్ని మందుబాబులు రెట్టింపు ధరలకు అయినా ఎగబడి బ్లాక్‌లో కొనుగోలు చేయడంతో మళ్లీ వ్యాపారులకు కన్ను కుట్టినట్లైంది.
మద్యం దుకాణాల్లో చోరీలు…
మద్యం దుకాణాలను తెరిచే అవకాశాలు లేకపోవడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా పదుల సంఖ్యలో మద్యం దుకాణాల్లో చోరీలు జరిగాయి. యత్నాలకైతే కొదవలేదు. దొంగతనం జరిగితే అబ్కారీ శాఖకు చూపించాల్సిన స్టాక్ లెక్కలు దొంగతనంలో కలిపివేయవచ్చనే కుట్రకు తెరలేచింది. దొంగతనం జరిగితే ఆ కేసు పోలీస్ శాఖకు, స్టాక్ లెక్కలు, ఆ సరుకు ఎక్కడిది అనే విచారణ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఉండటంతో పేచి వచ్చింది.
ఇటీవల జిల్లా కేంద్రంలో 4వ టౌన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డులో ఓ గోదాంలో సుమారు రెండున్నర లక్షల మద్యం పట్టుకున్నారు. అందుకు సంబంధించిన మధు సుధాకర్ రెడ్డి(ప్రభుత్వ ఉద్యోగి), అతని తనయుడు వినిత్ రెడ్డి(ఎంఎస్ఆర్ బార్ యజమాని), శ్రీనివాస్‌గౌడ్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీరా స్టాక్ ఎక్కడిది.. అది ఏ బార్ ది, లేదా ఏ వైన్స్ ది అనే విచారణ అబ్కారీ శాఖపై పడింది. దీంతో రెండు శాఖల మధ్య విచారణలో సమన్వయం ఉంటుందా లేక మద్యం అక్రమ నిల్వల కేసును నీరుగారుస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మద్యం దుకాణాలలో స్టాక్ విషయంలో ఆ శాఖ వద్ద లెక్కలు లేనందున వ్యాపారులు చెప్పినట్లే రాసుకుంటారనే వాదనలు ఉన్నాయి. మద్యం పోలీస్, ఎక్సైజ్ శాఖల మధ్య పేచి పెట్టింది. చాలా ప్రాంతాలలో అక్రమ మద్యం అమ్మకాలు, స్టాక్ వివరాల గురుంచి ఎక్సైజ్ శాఖకు తెలిసినా పట్టించుకోవడం లేదని, పోలీస్ శాఖ కరోనా కట్టడిలో బిజీగా ఉన్నామంటూ ఈ అక్రమ మద్యం గురుంచి పట్టించుకోవడం లేదు.
Tags: Nizamabad, liquor, illegal sales, police, excise police, cases