- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చత్రినాకలో అక్రమ మద్యం పట్టివేత
దిశ, హైదరాబాద్: బెల్ట్ షాపు లైసెన్స్ గడువు ముగిసినా, యథేచ్చగా అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సౌత్ జోన్ చత్రినాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ సాయిబాబా నగర్‌కు చెందిన విశ్వనాథ్ (32) బెల్టు షాపు లైసెన్స్ గడువు ముగిసినా లిక్కర్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, చత్రినాక పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన దాడిలో లైసెన్స్ గడువు తీరినా.. లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండానే బెల్టు షాపును నిర్వహించడంతో పాటు లిక్కర్‌ను చట్ట విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.60 వేల విలువైన 120 బీర్ బాటిళ్లు, 122 విస్కీ క్వార్టర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, చత్రినాక పోలీసులు పాల్గొన్నారు.