- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవార్డులు వెనక్కిచ్చేస్తున్న ఇళయరాజా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రసాద్ స్టూడియోస్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మధ్య వార్ ముగిసిన కొన్ని రోజులకే మరో న్యూస్ తెరపైకి వచ్చింది. ఇళయరాజా తన స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్‌ను తిరిగి ఇచ్చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఓ వీడియో మెసేజ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మ్యాస్ట్రో. ఈ రూమర్స్ అన్నీ బేస్‌లెస్ అని.. తానెప్పుడూ అలా చెప్పలేదని స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి ద్వారా పుకారు ప్రారంభం అయిందని.. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలో వివరించారు. ఇసాయి కలైగ్నార్ సంగం అధిపతి అయిన ధీనాతో సమావేశం తర్వాతే అసత్య ప్రచారం మొదలైందని ఆరోపించారు ఇళయరాజా. ప్రసాద్ స్టూడియోస్‌తో జరిగిన గొడవ గురించి మాత్రమే తను మాట్లాడానని.. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రసాద్ స్టూడియో మేనేజ్మెంట్ తన వ్యక్తిగత గది నుంచి అవార్డులను తీసేసి.. స్టోర్‌లో పడేయడాన్ని తట్టుకోలేకపోయానని మాత్రమే చెప్పానన్నారు. కానీ, ఈ విషయాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని .. తను అవార్డులు వెనక్కి ఇచ్చేస్తానన్న మాటల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
#இளையராஜா pic.twitter.com/qeqA60ouY1
— Diamond Babu (@idiamondbabu) January 18, 2021