- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైస్ మిల్లుకు షాక్ ఇచ్చిన ఐకేపీ.. వడ్లకు బదులు..
దిశ,మానకొండూరు: వడ్లకు బదులు నూకలు, ఇసుకను పంపారు ఓ ఐకేపీ కేంద్రం నిర్వాహకులు. మిల్లర్లు గుర్తించడంతో ఈ మోసం వెలుగు లోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం కర్న మామిడి ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల లోని జ్యోతి పారాబాయిల్డ్ రైస్ మిల్లుకి ముగ్గురు రైతులకు చెందిన 846 వడ్ల బస్తాలను టీఎస్ 02 యూసీ 2233 నంబర్ గల లారీలో లోడ్ చేసి పంపారు.
ఆదివారం ఉదయం రైస్ మిల్లు లో లోడు దించుతుండగా గుర్తించిన హమాలీలు యజమాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన యజమాని లోడును క్షుణ్ణంగా పరిశీలించగా సుమారు ఇరవై బస్తాల నూకలు, ఇసుక, మన్ను, తాలు నింపిన బస్తాలు బయటపడ్డాయి. దీంతో సంబధిత అధికారులకు, రైస్ మిల్లు అసోసియెషన్ వాళ్లకు ఫిర్యాదు చేశారు. జిల్లా పాలనాధికారికి సైతం ఫిర్యాదు చేసినట్లు రైస్ మిల్లు యజమాని తెలిపారు. కర్ణమామిడి ఐకేపీ కేంద్రం నిర్వాహకులు దళారులతో కుమ్మక్కయి ఈ మోసాని కి పాల్పడినట్లు యజమాని ఆరోపించారు.