- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇన్నోవేషన్ హబ్‌గా ఐఐటీ హైదరాబాద్
దిశ, కంది : ఐఐటీల్లో కొత్త పరిశోధనలతో ముందడుగు వేసి ఐఐటీ హైదరాబాద్‌ను దేశంలోనే నెంబర్ వన్ ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ఎన్ మూర్తి స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ మొత్తం 3800 విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తుండగా, 1200 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉండటం ఎంతో గొప్ప విషయమని ఆయన చెప్పారు. గడిచిన రెండేళ్లలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తాము కూడా ఇబ్బందులను అధిగమించేందుకు సరికొత్త పరిశోధన చేసి కొవిడ్ టెస్టు కిట్లు, ఇతర కొవిడ్ నియంత్రణ పరికరాలు ప్రత్యేకంగా తయారు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చామని గుర్తు చేశారు.
వచ్చే డిసెంబర్ నాటికి ఐఐటీ క్యాంపస్ నిర్మాణం పూర్తి
వచ్చే డిసెంబర్ నాటికి ఐఐటీలో ఉన్న అన్ని విభాగాల బిల్డింగుల నిర్మాణాలు పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చేలా పనులు శరవేగంగా సాగుతున్నాయని డైరెక్టర్ మూర్తి తెలియజేశారు. క్యాంపస్ నిర్మాణం పూర్తయిన వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం ఇచ్చేలా పనులు జరుగుతున్నాయని వివరించారు. దేశంలోని ఐఐటీలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ట్ తో పాటు ఆకాశాన్ని అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు మంచి వసతులతో నిర్మించుకోవడం జరిగిందన్నారు. బయట వాతావరణం 40 డిగ్రీలకు వేడి ఉన్నా కూడా బిల్డింగ్ లోపల 24 నుంచి 22 డిగ్రీలు ఉండేలా ఈ క్యాంపస్ బిల్డింగ్ రూపొందించడం దీని ప్రత్యేకత అని ఆయన వివరించారు. అయితే కొవిడ్ సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు విద్యాబోధన ఆపకుండా ఆన్లైన్లో వారి క్లాస్ ను పూర్తి చేసేలా కృషి చేసిన ఫ్యాకల్టీ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఐఐటీ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామని డైరెక్టర్ మూర్తి తెలిపారు. గడిచిన రెండేళ్లలో కాలంలో క్యాంపస్‌లో ఇప్పటివరకు16 వేలకు పైగా మొక్కలను నాటడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రతి శనివారం తమ క్యాంపస్లో ఇక్కడ ఫ్యాకల్టీ తోపాటు విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. కాలుష్యాన్ని పూర్తిగా పారదోలే విధంగా క్యాంపస్ లో ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్ ప్రజా రవాణా కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ పార్క్ స్థలంలో నిర్మితమైన ఏకైక ఐఐటీ క్యాంపస్ మద్రాసులో ఉన్నదని, దానికి ధీటుగా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ను కూడా పూర్తిస్థాయిలో గ్రీన్ క్యాంపస్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.