- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నన్ను బలవంతం చేస్తే ఈ ఊరే వదిలేసి పోతా..? వ్యాక్సిన్ మాత్రం వేసుకోను!

X
దిశ, మల్యాల : వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత అధికారులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కరోనా టీకా వేస్తున్నారు. అయితే, జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపెల్లి గ్రామానికి వెళ్లిన అధికారులకు అనుకోని షాక్ తగిలింది. వ్యాక్సిన్ వేసుకోవాలని కోరగా ఓ వ్యక్తి మాత్రం తాను టీకా వేసుకోనని తెగేసి చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు.
తాటిపెల్లికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత నచ్చచెప్పినా అస్సలు మాట వినిపించుకోవడం లేదు. కరోనా వ్యాక్సిన్ మత్తు మందు అని టీకా తీసుకున్న వాళ్లు చనిపోతున్నారని.. తనను ఇంకా బలవంతం చేస్తే ఊరు విడిచి వెళ్ళిపోతాను కానీ, టీకా మాత్రం వేసుకోనని తెగేసి చెప్పడంతో చేసేదేమీ లేక అధికారులు తిరుగు పయనమయ్యారు.
Next Story