నాగ్ "శివమణి" ఇప్పుడు చేస్తే… పూరీ డైలాగ్స్ ఇలా…

by vinod kumar |
నాగ్ శివమణి ఇప్పుడు చేస్తే… పూరీ డైలాగ్స్ ఇలా…
X

శివమణి… నాగార్జున హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. రౌడీ లను రఫ్ఫాడించే పోలీసు ఆఫీసర్ గా అదరగొట్టేశాడు నాగ్. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టగా… పూర్ణ మార్కెట్ ఏరియా రౌడీలకి శివమణి ఇచ్చే వార్నింగ్ గురించి ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే డైలాగ్ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో చెప్తే ఎలా ఉంటుందో స్పూఫ్ వీడియో చేశాడు ఓ నెటిజన్. ఇది కాస్త నాగ్ దాకా వెళ్లి… తనకి కూడా నచ్చడంతో తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఇప్పుడు కనుక నేను శివమణి మూవీ చేస్తే… పూరీ జగన్ డైలాగ్స్ ఇలా ఉండేవి అంటూ పోస్ట్ పెట్టాడు.

కాగా స్పూఫ్ వీడియో డైలాగ్ ఇలా ఉంది. ” నా పేరు శివమణి.. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను … ఇప్పటి వరకు మాస్క్ లు లేకుండా ఎందుకు తిరిగావ్ అని నేను అడగా… సడెన్ గా కరోనా ఉంది మాస్క్ లు వేసుకోండి అంటే కొంచెం కష్టంగానే ఉంటది.. ఇంట్లోనూ ఒకరికి ఒకరు దూరంగా ఉండడానికి ట్రై చేయండి .. మీరు తిరగడం మానేయలేరని నాకు తెలుసు.. చెప్పానుగా బే లాక్ డౌన్ మీ వల్లే పొడిగించారని.. మీరు తప్పు చేసి గుంపులు గుంపులుగా తిరగడం వల్ల మిమ్మల్ని కాపడలేక డాక్టర్లు, నర్సులు ఏడుస్తున్నరు రా… మీకు కాపలా కాయలేక మా పోలిసోల్లు చస్తున్నారు రా… ఏంది రా అల చూస్తున్నావ్.. మాస్క్ ఏది రా.. కరోనా అంటే భయం లేదు రా మీకు…. టీవీలో మోడీ మొత్తుకుంటుటే వినిపించట్లేదా… సీఎంలు చెప్తుంటే అర్ధం కావట్లేదా…పో పో పోయి మాస్క్ ఎస్కో… మళ్లీ షాపులని, చికెనని, మటనని ఇలా గుంపులుగా ఉన్నారో దూల తీర్చేస్తా… ఇప్పటి వరకు దేశంలో ఉన్న కరోనా కేసులు చాలు ” అంటూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డైలాగ్స్ రాశారు.


Tags: Shivamani, Nagarjuna, Puri jagannadh, Bollywood, CoronaVirus, Corona, Covid 19

Advertisement

Next Story

Most Viewed