- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Babu Mohan: ‘రైతులపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఒకేసారి రుణ మాఫీ చేయాలి’
దిశ, ఆందోల్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒకేసారి రుణ మాఫీ చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్షను మాజీ మంత్రి బాబు మోహన్ హైదరాబాదులోని ఆయన నివాసం వద్ద సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీని ఇప్పటివరకు అమలు చేయలేదని, ఇంకెన్నాళ్లు రుణ మాఫీ కోసం రైతులు ఎదురు చూడాలని ఆయన ప్రశ్నించారు.
రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో జిల్లాలోని చాలాచోట్ల రైతుల ధాన్యం తడిసి ముద్దయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి కేంద్రం అందజేసిన వ్యాక్సిన్ లలో గోల్‌మాల్ జరిగిందని ఆయన ఆరోపించారు.
మూడు నియోజకవర్గాలకే రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ల నియోజకవర్గాలైన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకు కేటాయిస్తున్నారన్నారు. మిగతా నియోజకవర్గాలను పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.