- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 50సీట్లు కూడా రావు..!
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు మించి గెలవదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవని అన్నారు. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో సీఎం జగన్, తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఐవీఆర్ఎస్ విధానంలో సర్వే చేయించినట్లు చెప్పారు. జగన్‌కు తనకు మధ్య 19శాతం వ్యత్యాసం ఉందని తేలిందన్నారు. జగన్ కంటే తనదే పై చేయని ఐవీఆర్ఎస్ సర్వే చెప్పిందన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో కూడా సర్వే వెల్లడించిందన్నారు. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబులకు 60 శాతం ప్రజలు మద్దతు పలికారన్నారు. జిల్లాల వారీగా ఎవరు గెలుస్తారో..ఎవరు ఓటమిచెందుతారో కూడా సర్వేలో తేలిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు మించి గెలవదని చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబులు 60శాతం గెలిచే అవకాశం ఉందన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దాన్ని ఆపేందుకు సర్వే వివరాలు చెప్పినట్లు వెల్లడించారు.
వైసీపీపైనా కొందరు ఎమ్మెల్యేలపైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వ్యఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు మాత్రమే 50 శాతం పాజిటివిటీ ఉందని మిగిలిన వారికి కష్టమేనని చెప్పుకొచ్చారు. మరోవైపు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని ఎంపీ విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారని నిలదీశారు. ఈ అంశంలో సీబీఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని రఘురామ అభిప్రాయపడ్డారు. వివేకా మృతిపై విషయం మార్చి చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ రఘురామ సీబీఐని డిమాండ్ చేశారు.