- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడంబా ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు..!
దిశప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ డివిజన్లోని కడంబా ఫారెస్ట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామిడికి చెందిన చొక్కాలు, అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం యాపల్గూడకు చెందిన జుగ్నాక బాదీరావ్లుగా గుర్తించారు. అయితే ముందుగా ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్ భార్య కంతి లింగవ్వ, మరో మావోయిస్టు వర్గీస్ ప్రభాత్‌లు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ తాజాగా పోలీసులు వెల్లడించిన ప్రకారం మృతులు ఇద్దరూ వేరే వాళ్ళు కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా అగ్రనేత భాస్కర్ సహా మిగతా వాళ్లు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఒక 9 ఎంఎం పిస్టల్, 12 బోర్ తుపాకీ లభ్యమయ్యాయి. విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని లేఖలు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.