ఎలైట్ క్లబ్'లో చేరిన ఐసీఐసీఐ

by Harish |
icici
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బీమా కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ శుక్రవారం అరుదైన ఘనతను సాధించింది. బీఎస్ఈలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లతో ‘ఎలైట్ క్లబ్’ జాబితాలో చేరింది. కంపెనీ షేర్ ధర రూ. 708.20 వద్ద సరికొత్త గరిష్ఠ స్థాయిని చేరుకోవడం ద్వారా 5 శాతం లాభపడింది. దీంతో ప్రత్యేకంగా ఈ ఎలైట్ క్లబ్ జాబితాలో చేరిన మూడో సంస్థగా నిలిచింది. ఇప్పటివరకు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ. 1.49 లక్ష కోట్లతో మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో ఉంది. రూ. 1.23 లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌తో రెండోస్థానంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొనసాగుతోంది. తాజాగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కంపెనీ కొత్త గరిష్ఠాలతో ర్యాలీ చేయడంతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 1.02 లక్ష కోట్లకు పుంజుకుంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సంస్థ షేర్ ధర 2.6 శాతం పెరిగి రూ. 692.30 వద్ద ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed