ఉద్యోగుల వ్యాక్సిన్ ఖర్చు భరించనున్న ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్!

by vinod kumar |   ( Updated:2021-03-10 08:46:41.0  )
ICICI Bank New Rules
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ తమ ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అయ్యే ఖర్చును భరించనున్నట్టు వెల్లడించింది. దాదాపు లక్ష మందికి వరకూ ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్ ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

మహమ్మారి సమయంలో ఉద్యోగులు చూపిన అంకితభావం, పట్టుదలకు కృతజ్ఞతగా కరోనా నుంచి రక్షణగా ఉండేందుకు అవసరమైన రెండు వ్యాక్సిన్ డోసుల ఖర్చులను ఉద్యోగులు రీయంబర్స్‌మెంట్ చేయనున్నట్టు బ్యాంకు పేర్కొంది. కాగా, ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ కోసం ఖర్చును భరిస్తామని ప్రకటించాయి.

ఫ్లిప్‌కార్ట్ సైతం తమ ఉద్యోగులు, వారి ముగ్గురు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ కోసం అయ్యే ఖర్చును భరించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ మింత్రా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు వ్యాక్సి తీసుకునే రోజున సెలవును ఇవ్వనున్నట్టు పేర్కొంది. కరోనా తీసుకున్న తర్వాత సమస్యలేమైన ఎదురైతే కొవిడ్ స్పెషల్ కేర్ లీవ్‌ను ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed