- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సస్పెన్స్ క్రియేట్ చేసిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఒక అబ్బాయి లైఫ్‌లో అమ్మ, అమ్మాయి, బైక్‌కు ఉన్న అవినాభావ సంబంధమే సినిమా. రియల్ ఈవెంట్స్ బేస్ చేసుకుని చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ఎస్.దర్శన్. తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతుండగా.. బైక్ నో పార్కింగ్ ఏరియాలో పెట్టడం వల్ల హీరో ఎదుర్కొన్న పరిణామాలేంటి? అంత మంది రౌడీలు, కాలనీ వాసులు తనను మర్డర్ చేసేందుకు ఎందుకు వెంటపడుతున్నారు? అనేది టీజర్‌లో చూపించగా.. అసలు ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలనే ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.
‘అల వైకుంఠపురంలో’ తర్వాత సుశాంత్ చేస్తున్న ఈ మూవీ టీజర్ ప్రామిసింగ్‌గా ఉండగా.. ఈ సారి పక్కా హిట్ కొట్టేలాగే ఉన్నాడు అంటున్నారు నెటిజన్లు. రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్ రిలీజ్ చేయగా..సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయగుండ్ల నిర్మిస్తుండగా ఐశ్వర్య, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు.