BREAKING: ఫైనల్‌లో తడబడి నిలబడిన భారత్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

by Satheesh |   ( Updated:2024-06-29 16:23:31.0  )
BREAKING: ఫైనల్‌లో తడబడి నిలబడిన భారత్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్స్ సమిష్టి ప్రదర్శన చేశారు. మ్యా్చ్ స్టార్టింగ్‌లోనే వరుసగా మూడు వికెట్లు కోల్పోయి టెన్షన్ పెట్టిన.. ఆ తర్వాత పుంజుకుని రేసులో నిలబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 9, పంత్ 0, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులు మాత్రమే చేసి కీలకమైన ఫైనల్ మ్యాచులో చేతులెత్తేయగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఇండియాను అదుకున్నాడు.

ఓ పక్కా వికెట్లు పడుతున్నా.. అక్షర్ పటేల్‌తో కలిసి టీమిండియా ఇన్సింగ్‌ను నిర్మించాడు. కోహ్లీ, అక్షర్ జోడి సౌతాఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని టీమిండియాను టైటిల్ రేసులో నిలిపారు. కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా.. అక్షర్ 31 బంతుల్లో 47 రన్స్ చేశాడు. చివర్లో దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజు, నోర్జే చెరో రెండు వికెట్లు తీయగా.. జాన్‌సన్, రబాడ ఒక్కో వికెట్ సాధించారు. అనంతరం ప్రొటిస్ 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.

Advertisement

Next Story