T-20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్

by Rajesh |   ( Updated:2024-06-15 03:27:03.0  )
T-20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 ప్రపంచకప్ టోర్నీలో రెండు పెద్ద జట్లకు బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ నిష్క్రమించాయి. టీ-20 ప్రపంచకప్ సూపర్-8కు అఫ్గానిస్తాన్, యూఎస్ఏ క్వాలిఫై అయ్యాయి. పాపువా న్యూగీనీపై విజయంతో అఫ్గానిస్తాన్ సూపర్-8లోకి అడుగుపెట్టింది. అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మ్యాచ్ రద్దవడంతో అమెరికా-ఐర్లాండ్ కు చెరో పాయింట్ దక్కాయి. ఐదు పాయింట్లతో సూపర్-8కు అమెరికా అర్హత సాధించింది. మరో వైపు న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ ల చేతిలో ఓడిపోగా.. మూడు మ్యాచ్ ల్లో గెలిచి అఫ్గానిస్తాన్ సూపర్-8కు దూసుకెళ్లింది. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ 3 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఇప్పటికే సూపర్-8కు వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed