- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: నిలిచిన ఇండియా, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్.. ఎందుకంటే..?
దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్-2లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. వెస్టిండీస్‌లోని గయానా స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌కు వరుణుడు మరోసారి అటంకం కలింగించాడు. గయానా స్టేడియం వద్ద భారీగా వర్షం కురవడంతో మ్యా్చ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 37, సూర్య కుమార్ యాదవ్ 13 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కీలకమైన సెమీస్‌లో తీవ్రంగా నిరాశపర్చారు. కోహ్లీ 9, పంత్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడటంతో పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుంది.
దీంతో పరుగులు చేయడం ఇండియా బ్యాటర్స్‌కు సవాల్‌గా మారింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టూప్లే, సామ్ కరాన్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే గయానాలో భారీ వర్షం కురిసింది. దీంతో టాస్ ఆలస్యమైంది. 8 గంటలకు మొదలు కావాల్సిన మ్యాచ్ 9.15 నిమిషాలకు మొదలైంది. ప్రారంభమైన కాసేపటికే మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే.. సూపర్-8లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఇండియా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ నెల 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్-1 లో ఆఫ్ఘాన్‌పై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ టైటిల్ కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.