- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏబీ డివిలియర్స్ విశ్వరూపాన్ని బయటపెట్టిన ఐసీసీ(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఏబీ డివిలియర్స్.. జెర్సీ నెంబర్ 17.. మిస్టర్ 360.. ప్రపంచ క్రికెట్ ఈ మూడింటి గురించి ఆరా తీస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. సౌత్ ఆఫ్రికా జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ ఏబీడీకి ఉండే క్రేజ్ అంతా.. ఇంతా.. కాదు. ఇక కెప్టెన్‌గా ఉన్న సమయంలో అభిమానుల్లో పిచ్చి పీక్స్‌లో ఉండేది. తన క్రికెట్ కెరీర్‌లో తనదైన ముద్ర వేసి మిస్టర్ 360గా పేరుతెచ్చుకున్నాడు. ఇటువంటి ఆటగాడు అంతర్జాతీయ అన్ని ఫార్మాట్ల నుంచి శుక్రవారం తప్పుకోవడంతో ఐసీసీ ఘన వీడ్కోలు చెప్పింది. 2015లో ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఈ ఆటగాడి ప్రతిభను క్రికెట్ ప్రపంచానికి మరోసారి గుర్తు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలకు ప్రత్యర్థిగా వెస్టిండీస్ బరిలో ఉంది.
https://twitter.com/ICC/status/1461673108218077192?s=20
ఈ సమయంలో సఫారీల కెప్టెన్‌గా ఉన్న ఏబీడీ అదరగొట్టాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో వెస్టిండీస్‌కు చుక్కలు చూపించాడు. కేవలం 62 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లు బాది ఏకంగా 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన వ్యక్తిగత పరుగులతో వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏబీడీ బ్యాటింగ్‌తో జట్టు స్కోరు అమాంతం 408కి పెరిగింది. ఇక లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి ఓడిపోయింది. కానీ, ఆ మ్యాచ్‌లో డివిలియర్స్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇది ఇప్పటికీ, ఎప్పటికీ చెదిరిపోనిది. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పెట్టిన ఐసీసీ మిస్టర్ 360 అంటే ఏంటో చూపించింది.