క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త !

by Shyam |
క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త !
X

అందుబాటులో పాత మ్యాచ్‌ల వీడియోలు

అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పింది. 45 ఏండ్లుగా జరిగిన ఎన్నో టోర్నమెంట్లు, మరపురాని మ్యాచ్‌ల వీడియో ఫుటేజీలను ఫ్యాన్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రికెట్ మ్యాచులన్నీ రద్దు కావడం, టీవీల్లో లైవ్ క్రికెట్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచుల ఆర్కైవ్స్‌ను బ్రాడ్ కాస్టర్లకు రిలీజ్ చేసింది. అందరూ లాక్‌డౌన్ కారణంగా ఇండ్లలోనే ఉంటుండటంతో క్రికెట్ బ్రాడ్‌కాస్టర్లు ఈ ఫుటేజీని వాడుకోవచ్చని ఐసీసీ తెలిపింది.

1975 నుంచి జరిగిన మ్యాచ్‌ల వీడియోలతో పాటు, ఐసీసీ పురుషుల, మహిళల వరల్డ్ కప్స్, టీ20 వరల్డ్ కప్స్, ఛాంపియన్స్ ట్రోఫీలకు సంబంధించిన వీడియోలు, ఐసీసీ ఫిల్మ్స్, అండర్ 19 వరల్డ్ కప్స్‌కు సంబంధించిన ఫుటేజీ విడుదల చేసింది. కేవలం బ్రాడ్‌కాస్టర్లకే కాకుండా.. ఐసీసీ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో కూడా కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తోంది. వీటితో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అలనాటి మేటి మ్యాచ్‌ల క్లిప్పింగ్స్ ఉంచింది.

ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతం క్రీడారంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. క్రీడా అసోసియేషన్లే కాక బ్రాడ్‌కాస్టర్లు కూడా ఆర్థికంగా నష్టాలను మూటగట్టుకుంటున్నారు. అంతే కాకుండా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆటను ఆస్వాదించే అవకాశం పోయింది. అందుకే మళ్లీ వాళ్లను క్రికెట్‌తో కలపాలనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ వీడియోలపై పైరసీ చట్టాలున్నాయని.. ఎవరూ అక్రమంగా వాడుకోవడానికి వీల్లేదని ఆయన చెప్పారు. ‘మేం విడుదల చేసిన ఈ ఫుటేజీతో బ్రాడ్‌కాస్టర్లు కోల్పోయిన మ్యాచుల బదులు టెలికాస్ట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఫ్యాన్స్‌ కూడా ఫేస్‌బుక్ వాచ్ పార్టీలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేసే అవకాశం ఉందని’ అన్నారు.

ఐసీసీ విడుదల చేసిన ఫుటేజీ వివరాలు:

– 1975, 1979, 1983 ఐసీసీ వరల్డ్ కప్
– 2004, 2006, 2009, 2013 చాంపియన్స్ ట్రోఫీ
– 2007 నుంచి 2017 వరకు టీ20 వరల్డ్ కప్
– 2009, 2013 ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్
– ఐసీసీ 2019 వరల్డ్ కప్ బిహైండ్‌ ద సీన్స్, హైలైట్స్, అఫీషియల్ ఫిల్మ్
– ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్‌లు
– ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు
– యాషెస్ సిరీస్ హైలైట్స్.

Tags : ICC, Old matches videos, clippings, facebook, Highlights, broadcasters

Advertisement

Next Story

Most Viewed