- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కెరీర్ బెస్ట్ ర్యాంకుల్లోకి అశ్విన్, పంత్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ తాజాగా విడుదల చేసిన క్రికెట్ ర్యాంకుల్లో భారత టెస్టు జట్టు ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో శతక వీరుడు రోహిత్ శర్మ తొమ్మిది స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరుకున్నాడు. టాప్ ర్యాంకులో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, 5వ స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. ఇక ఇటీవల నిలకడగా రాణిస్తున్న రిషబ్ పంత్ 11వ స్థానానికి చేరుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంకు. మరోవైపు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో రవిచంద్రన్ అశ్విన్ 14 స్థానాలు మెరుగుపరుచుకొని 81వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో 5వ ర్యాంకులో, బౌలర్ల జాబితాలో 7వ ర్యాంకులో నిలిచాడు. బౌలింగ్ జాబితాలో పాట్ కమ్మిన్స్, ఆల్‌రౌండర్ల జాబితాలో జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
టాప్ 5 ర్యాంకులు
బ్యాట్స్‌మెన్
1. కేన్ విలియమ్‌సన్ (919)
2. స్టీవ్ స్మిత్ (891)
3. మార్నస్ లబుషేన్ (878)
4. జో రూట్ (869)
5. విరాట్ కోహ్లీ (838)
బౌలర్స్
1. పాట్ కమ్మిన్స్ (908)
2. నిల్ వాగ్నర్ (825)
3. జేమ్స్ అండర్సన్ (818)
4. జోష్ హాజెల్‌వుడ్ (816)
5. స్టువర్ట్ బ్రాడ్ (807)
ఆల్‌రౌండర్స్
1. జేసన్ హోల్డర్ (407)
2. రవిచంద్రన్ అశ్విన్ (403)
3. బెన్ స్టోక్స్ (397)
4. షకీబ్ అల్ హసన్ (352)
5. రవిచంద్రన్ అశ్విన్ (336)