టాప్ ర్యాంకులో కోహ్లీ.. మెరుగుపడిన భువీ ర్యాంకు

by Shiva |
టాప్ ర్యాంకులో కోహ్లీ.. మెరుగుపడిన భువీ ర్యాంకు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి అదరగొట్టారు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనపర్చిన క్రికెటర్ల ర్యాంకులు మెరుగుపడ్డాయి. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో వరుసగా రెండు అర్ద సెంచరీలు నమోదు చేసి 870 ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాడు. దీంతో అతడు మరోసారి టాప్ 1 ర్యాంకుకు చేరుకున్నాడు. రోహిత్ శర్మ 3వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక సిరీస్‌లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ 31 నుంచి 27వ ర్యాంకుకు ఎగబాకాడు. హార్దిక్ పాండ్యా 42వ ర్యాంకులో కొనసాగుతుండగా.. రిషబ్ పంత్ తొలి సారిగా ఐసీసీ టాప్ 100 ర్యాంకుల్లో ప్రవేశించాడు.

చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి ఇంగ్లాండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ ఏకంగా 9 స్థానాలు మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. 2017 తర్వాత భువీకి ఇదే అత్యుత్తమ ర్యాంకు. శార్దుల్ ఠాకూర్ 80 వ ర్యాంకుకు చేరుకున్నాడు. టెస్టుల్లో ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ 1వ ర్యాంకులో కొనసాగుతుండగా.. బౌలింగ్ విభాగంలో 8వ ర్యాంకును అందుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో 2వ ర్యాంకు, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల విభాగంలో 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

వన్డే ర్యాంకింగ్స్ :

బ్యాటింగ్

1. విరాట్ కోహ్లీ (857)
2. బాబర్ అజమ్ (837)
3. రోహిత్ శర్మ (825)
4. రాస్ టేలర్ (801)
5. ఆరోన్ ఫించ్ (791)

బౌలింగ్

1. ట్రెంట్ బౌల్ట్ (737)
2. ముజీబుర్ రెహ్మాన్ (708)
3. మాట్ హెన్రీ (691)
4. జస్ప్రిత్ బుమ్రా (690)
5. మెహెదీ హసన్ (668)

ఆల్‌రౌండర్

1. షకీబ్ అల్ హసన్ (408)
2. బెన్ స్టోక్స్ (295)
3. మహ్మద్ నబీ (294)
4. క్రిస్ వోక్స్ (273)
5. ఇమాద్ వాసిమ్ (271)

Advertisement

Next Story

Most Viewed