- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఖేల్ రత్న’ వెనక్కిచ్చేస్తా: విజేందర్ సింగ్
ఢిల్లీ: రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించకుంటే తాను పొందిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును వెనక్కిచేస్తానని బాక్సర్ విజేందర్ సింగ్ హెచ్చరించారు. రైతుల డిమాండ్‌ల కు తాను సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారని, యావత్ దేశమూ సపోర్ట్ చేయాలని అన్నారు. అన్నదాతల్లేకుండా ఒక్క రోజూ ఎవ్వరూ జీవించలేరని 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన విజేందర్ సింగ్.. సింఘు సరిహద్దులో తెలిపారు. జాతీయ మాజీ బాక్సింగ్ కోచ్ గుర్‌బక్ష్ సింగ్ సంధు తాను పొందిన ద్రోణాచార్య అవార్డును వాపస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బాగాలేవని, రైతుల ప్రయోజనాల కోసమే చట్టాలు రూపొందించామని సర్కారు చెబుతున్నదని తెలిపారు. కానీ, రైతులే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. రైతులతో సర్కారు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, తానూ రైతు కుటుంబం నుంచి వచ్చిననీ..సదరు చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తపరచడం మినహా తామేమీ చేయలేమని తెలిపారు. రైతులకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ద్రోణాచార్య అవార్డును వెనక్కిస్తున్నట్టు చెప్పారు.