- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ త్వరాత ‘సీఎం’ పదవిపై ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఈటలపై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం కావాలనుకోలేదని చెప్పారు. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే కావాలని ఆయన కోరినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఇంత కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించలేదని విమర్శించారు. వ్యక్తులు ఉంటారు.. పోతారు.. కానీ, ధర్మం ఎక్కడికీ పోదని అన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తానని తెలిపారు. తన వ్యవహారంలో మంత్రులు అత్యంత దారుణంగా మట్లాడుతున్నారని.. మంత్రుల వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. ఇతర పార్టీల వాళ్లతో మాట్లాడటమే నేను చేసిన తప్పా.. అని ప్రశ్నించారు. ఇకపై అన్ని పార్టీల నాయకులను కలుస్తాను, వారితో మాట్లాడతానని అన్నారు.