- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను ఎవరికీ భయపడను : పవన్
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజల సమస్యలను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా, ఆ సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన పాలక పక్షంలో ఉండడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చుతున్నారని, ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అదే జరిగిందని ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమని, కానీ పాలకులు విభజించు, పాలించు అనే విధానంతో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. అధికారం అంటే వేల కోట్లను కొల్లగొట్టడం కాదని, ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడమేనన్న ఆయన.. జనసేన ఆ పని చేస్తుందని తెలిపారు. తనకు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొవడమే తెలుసని.. పారిపోవడం తెలియని జనసేనాని స్పష్టం చేశారు.
Advertisement
Next Story