- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏడేళ్లలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న హ్యూండాయ్!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ విభాగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్‌కు ధీటుగా తాజాగా హ్యూండాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంలో కొత్తగా ఆరు మోడళ్లను తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈవీ విభాగంలో తమ పోర్ట్‌ఫోలియోను వేగవంతం చేస్తూ తయారీ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ. 4,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు బుధవారం ప్రకటించింది.
2028 వరకు కంపెనీ తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్‌డీ) కోసం ఈ పెట్టుబడులను వినియోగించనుంది. దీని ద్వారా కంపెనీ రాబోయే ఏడేళ్లలో 6 కొత్త ఈవీ మోడళ్లను తీసుకురానున్నట్టు తెలిపింది. ఇప్పటికే కంపెనీ యుటిలిటీ విభాగంలో కోనా మోడల్‌ను తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ప్యాసింజర్ విభాగంలోకి వేగంగా విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. భారతీయ వినియోగదారులకు రానున్న రోజుల్లో మరిన్ని కొత్త మోడల్ వాహనాలను, అభివృద్ధి చెందుతున్న ఈవీ విభాగంలో అందించాలని నిర్ణయించామని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ అన్నారు.