కొత్త కార్లను విడుదల చేసిన హూండాయ్

by Harish |
hunday
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా గురువారం తన కొత్త ‘ఐ20 ఎన్ లైన్’ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ కారు ధర రూ. 9.84 లక్షల నుంచి రూ. 11.76 లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్‌లైన్‌లో ఎన్6, ఎన్8 వేరియంట్లు ఉన్నాయని, ఇవి రెండూ పెట్రోల్ వేరియంట్లే అని కంపెనీ పేర్కొంది.

1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఇవి పనిచేయనున్నాయి. ‘అంతర్జాతీయంగా మారుతున్న అత్యాధునిక సాంకేతికత, ఉత్పత్తులను భారత్‌లో ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే ఐ20 ఎన్ లైన్ వేరియంట్లను తీసుకొచ్చాము. ఈ కారు మోటార్‌స్పోర్ట్ స్టైలింగ్‌తో తమ వినియోగదారులకు కొత్త డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉందని’ హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కిమ్ అన్నారు. 6-స్పీడ్ ఐఎంటీ గేర్ బాక్స్‌తో వస్తున్న ఈ కారులో ఐదు మంది కూర్చునేందుకు వీలుగా ఉంటుందని, డ్రైవర్‌తో పాటు ప్యాసింజర్‌కు ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం ఇందులో ఉంటుందని కంపెనీ వివరించింది.

Advertisement

Next Story