- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడా ప్రొడ్యుసర్ పై హైపర్ ఆది ఫైర్.. కుక్కను కొట్టినట్టు కొట్టాలంటూ
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక, డిబేట్‌లకు వేదికగా మారుతోంది. మనసులో ఏం అనుకున్నా ఏమాత్రం భయపడకుండా ట్విట్టర్‌లో పోస్ట్ చేసేస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే కనీసం ఎదురుగా వచ్చి నిలదీయలేకపోయినా సోషల్ మీడియా ద్వారా వారిని ఏకిపారేస్తున్నారు. ఇక సినిమా హీరోలను ఎవరైనా ఏదైనా అంటే వారి ఫాన్స్ నెట్టింట్లో వారిని ఆడేసుకుంటున్నారు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత పీవీపీ (ప్రసాద్ వీ.పొట్లూరి) చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఒక వీడియోని ఆయన షేర్ చేశారు. ఇటీవలే ముంబై రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడిన పాపను ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో(రైల్వే స్టేషన్ సిబ్బంది) వీడియోను షేర్ చేస్తూ ‘‘రియల్ హీరో బాబు రీల్ హీరో కాదు. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు ఈ రియల్ హీరోకి జస్ట్ Jawa బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా, కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్‌కి కొడదాం బ్రదర్స్’’ అని ట్వీట్ చేశారు. అయితే.. ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే పీవీపీ పెట్టారని భావించిన పవన్ అభిమానులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.
నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్న కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు…
పులి ని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే
సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళన గా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని అనుకుంటున్నారు జనాలు. https://t.co/RO85f7UymY
— Hyper Aadhi (@AadhiHyper) April 23, 2021
పవన్ వీరాభిమానుల్లో ఒకరైన జబర్దస్త్ హైపర్ ఆది సైతం ఈ ట్వీట్‌పై తనదైన శైలిలో స్పందించారు. ‘‘నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్న కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు.. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళనగా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలని అనుకుంటున్నారు జనాలు’’ అంటూ పీవీపీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.