- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మళ్లీ ఆగిన హైదరాబాద్ మెట్రో

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు అప్పుడప్పడూ ప్రయాణికులకు ఊహించని షాక్ ఇస్తోంది. పలుమార్లు సాంకేతిక లోపంతో రైలును నిలిపివేయడంతో ప్యాసింజర్లు ఇక్కట్లు పడుతున్నారు. తాజాగా అమీర్‌పేట-జూబ్లీహిల్స్ మార్గంలో పరుగులు తీస్తున్న మెట్రో రైలు టెక్నీకల్ ప్రాబ్లమ్‌తో నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో మెట్రో సేవలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో అధికారులు హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ వైపు వస్తున్న రైలులోని ప్రయాణికులను కూడా దింపేశారు. అనంతరం నిలిచిపోయిన రైలు సేవలను పునరుద్దరించారు. ఇది ఇలా ఉంటే అత్యవసరంగా మెట్రో రైలు ఎక్కిన పలువురు ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు మెట్రో రైలు నిలిచపోయినప్పటికీ.. మరోసారి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.