హైదరాబాద్ వేగంగా డెవలప్ అవుతోంది : KTR

by Shyam |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ కీలకంగా మారిందని, త్వరలోనే ఆదిభట్ల వెలిమినేడులో ఫ్రెండ్స్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాదులోని తాజ్ హోటల్‌లో 100 ఏహెచ్ 64 అపాచీ ప్యూజలెస్ డెలివరీ సెర్మోని కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలం అని తెలిపారు. డిఫెన్స్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

టీ-హబ్ అనేక ఇన్విటేషన్ కార్యక్రమాలు ప్రారంభించిందని, డిఫెన్స్ సంవత్సరం హైదరాబాద్‌లో కొలువుదీరాయని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లో కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పరిశ్రమలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్పత్తిని ప్రారంభించాలని తెలిపారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జయేష్ రంజన్, కరణ్ సింగ్, మాల్యా అగర్వాల్, కృష్ణ, విజయ్ సింగ్, రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed