- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షీ టీమ్స్ ఏర్పాటు ఘనత కేసీఆర్‌దే: హోంమంత్రి
దిశ, క్రైమ్‌బ్యూరో: మహిళల భద్రతకు షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం గోల్కొండ సమీపంలోని తారామతి, బారాదరిలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మహిళా విభాగం లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావానికి కంటే ముందు హైదరాబాద్‌లో అనేక అల్లర్లు జరిగాయని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే మహిళల భద్రతపై దృష్టి సారించి షీ టీమ్స్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల సాధికారికత, సమానత్వం కోసం కృషి జరిగిందన్నారు. ఫలితంగా నగరానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వివరించారు. శుక్రవారం రాత్రి నగరంలో రౌడీ షీటర్ల వివాదాన్ని ప్రస్తావించిన హోంమంత్రి రౌడీషీటర్ల అందరిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీలు షికా గోయెల్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.