మ్యాచ్ డ్రా చేసుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ

by Shyam |
మ్యాచ్ డ్రా చేసుకున్న హైదరాబాద్ ఎఫ్‌సీ
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21 సీజన్‌లో భాగంగా బుధవారం గోవాలోని తిలక్ మైదాన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ, జెంషెడ్‌పూర్ ఎఫ్‌సీ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఈ సారి దూకుడుగా ఆడుతున్నది. ఈ మ్యాచ్‌లో జంషెడ్‌పూర్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి.

ఇక రెండో అర్థ భాగం మొదలైన తర్వాత హైదరాబాద్ జట్టు దూకుడు మరింత పెంచింది. బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకొని ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి ప్రారంభించింది. మ్యాచ్ 50వ నిమిషంలో హైదరాబాద్ ఆటగాడు అరిదానే సంతాన గోల్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు హైదరాబాద్ జట్టే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా జంషెడ్‌పూర్ జట్టు ఆటగాడు ఎజే గోల్ చేశాడు. దీంతో స్కోర్ 1-1తో సమానంగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇంజ్యూరీ టైం కలిపినా ఇరు జట్లు మరో గోల్ సాధించలేక పోయాయి. దీంతో మ్యాచ్ 1-1 స్కోర్‌తో డ్రాగా ముగిసింది. క్లబ్ అవార్డును ఇరు జట్లకు సమంగా పంచారు. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు లాల్‌దిన్‌లీనాకు దక్కగా.. మహ్మద్ యాసిర్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Advertisement

Next Story