- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో గంటలో సీన్ సితారే.. ఈసీ నిర్ణయంతో హుజురాబాద్‌లో హై టెన్షన్
దిశ ప్రతినిధి, కరీంనగర్: మరో ఏడు గంటల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో హుజురాబాద్ ను జల్లెడ పట్టనున్నాయి పోలీసు బలగాలు. కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు స్థానిక సివిల్ పోలీసులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మోహరించనున్నారు. 1800 కేంద్ర బలగాలు, 3 వేల స్థానిక బలగాలు అన్ని కూడా నియోజకవర్గంలోని 125 గ్రామాల్లో మోహరించనున్నాయి. ఇంటింటికి తిరిగి సోదాలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 7 గంటల తరువాత హుజురాబాద్ నియోజకవర్గంలో స్థానికేతరులైన నాయకులు ఉండకూడదన్న నిబంధన మేరకు బలగాలు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి నియోజకవర్గం అంతటా తనిఖీలు చేపట్టనున్నారు. స్థానికేతర నాయకులు షెల్టర్ తీసుకునే అవకాశాలు ఉన్నందున అనుమానితుల ఇళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. చివరి మూడు రోజుల్లో ప్రలోభాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయన్న కారణంతో పాటు ప్రచారం చేసే సమయం కూడా ముగిసిపోయినందున స్థానికేతర నాయకులు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో ఉండరాదని కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి హుజురాబాద్ వ్యాప్తంగా ఉండే గ్రామాలన్నింటిలోనూ సోదాలు నిర్వహించేందుకు పోలీసు అధికారులు రంగం సిద్దం చేశారు.