- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రలోభాలు.. నిలదీతలు.. హుజురాబాద్ పోలింగ్ సాగిందిలా..
దిశ, హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక: ఉప ఎన్నికల్లో నోట్ల ప్రవాహం మాత్రం ఆగలేదు. అటు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా గ్రామాల్లో నేడు కూడా నోట్ల పంపకాల ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగింది. ఊరు, వాడా అనకుండా ప్రతిచోట కూడా ప్రలోభాలకు గురి చేశారు. నియోజకవర్గం అంతటా కూడా డబ్బులు ఇచ్చే ప్రక్రియ సాగడం విమర్శలకు దారి తీసింది. ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. హుజురాబాద్ పట్టణంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త ఎడ్ల అశోక్ ను స్థానికులు పట్టుకున్నారు. స్థానిక హునుమాన్ మందిర్ వద్ద కూడా పట్టుకున్నారు.
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో కూడా కొన్ని ప్రాంతాల్లో స్థానికేతరులు డబ్బుల పంపిణీ చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇల్లందకుంట మండలం శ్రీరాములుపల్లిలో డబ్బులు పంచుతున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏంఎసీ ఛైర్మన్ భర్త మాదాసు శ్రీనివాస్ ను పట్టుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఓ కౌన్సిలర్ ఇంట్లో టీఆర్‌ఎస్ నాయకులు షెల్టర్ తీసుకుని డబ్బు పంపకాల్లో నిమగ్నం అయ్యారంటూ స్థానికులు ఆందోళన చేశారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వ్వాడ్స్ కూడా నియంత్రించలేకపోయారంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. జమ్మికుంట మండలం శాయంపేటలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి నమస్తే తెలంగాణ రిపోర్టర్ దేవేందర్ రెడ్డిని స్థానికులు పట్టుకున్నారు. మూడు రోజులుగా సాగిన నగదు పంపిణీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.
గొడవలే గొడవలు
మరోవైపు స్థానికేతరులు తిరుగుతున్నారంటూ మండిపడ్డ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. హుజురాబాద్ ప్రాంతానికి చెందని వారు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. జమ్మికుంట పట్టణంలో నిబంధనలకు విరుద్దంగా ఉన్నారంటూ వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏ కిరణ్ ను బీజేపీ నాయకులు పట్టుకున్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలో స్థానికేతరులను గుర్తించి గ్రామస్థులు పట్టుకున్నారు. వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు లో కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమను స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు.
పైసలిస్తేనే ఓట్లు…
ఇకపోతే సీల్డ్ కవర్ల పంచాయితీ ప్రభావం ఈ రోజు కూడా నియోజకవర్గంలో కనిపించింది. తమకు కవర్లెందుకు ఇవ్వలేదంటూ స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. వీణవంక మండలం గంగారం, ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేసి పోలింగ్ కు దూరంగా ఉంటున్నామని కొంతమంది ఓటర్లు ప్రకటించారు. జమ్మికుంట మండలం కోరెపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఇద్దరిని నిర్భంధించారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుల ఇళ్ల చుట్టూ నేడు కూడా కొంతమంది ఓటర్లు తిరిగారు. తమకెందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. అలాగే కొంతమంది ఓటర్లకు రూ. 3 వేల చొప్పున ఇవ్వడంపై కూడా కినుక వహించారు.
- Tags
- huzurabad