హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ : ఓటరు నమోదుకు చాన్స్

by Sridhar Babu |   ( Updated:2021-08-05 21:27:47.0  )
Voter Registration
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికల రానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1 జనవరి 2022 నాటికి 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. నూతన ఓటర్ల నమోదుతో పాటు సవరణలు, తప్పొప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. అర్హులైన వారు http://www.nvsp.in అనే వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నట్లయితే గుర్తించాలని కేంద్రం ఎన్నికల సంఘం సూచించింది. ఈ ప్రక్రియను ఈనెల 9వ తేదీ నుంచి వచ్చే అక్టోబర్ 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించింది. అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 1వ తేదీన ప్రచురించాలని పేర్కొంది. అభ్యంతరాలను దాఖలు చేయడానికి నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. డిసెంబర్ 20వ తేదీ నాటికి ఈ సవరణలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఫైనల్ లిస్ట్‌ను 2 జనవరి 2022 న ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed