- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని.. భర్త ఏం చేశాడంటే.?
దిశ, మక్తల్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యనే భర్త కడతేర్చాడు. ఈ దారుణ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతన్‌గోడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. నిందితుడు నర్సింహులు(28)కు దండు గ్రామానికి చెందిన లావణ్య(22)తో రెండు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి 8 నెలల పాప ఉంది. అయితే, వేరే మహిళతో నర్సింహులుకు అక్రమ సంబంధం ఉన్న కారణంగా భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే లావణ్యను నర్సింహులు కొట్టాడు. దీంతో లావణ్య పుట్టింటికి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారికి పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే వారం రోజుల కిందటే లావణ్య అత్తారింటికి వెళ్లింది. తీరు మార్చుకోని నర్సింహులు రెండు రోజుల క్రితం వేరే మహిళతో ఉండగా లావణ్య అతడిని నిలదీసింది.
ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన నర్సింహులు.. సోమవారం రాత్రి భార్యను దారుణంగా కొట్టి, గొంతు నులిమి చంపాడని, లావణ్య గొంతు చుట్టూ నల్లటి గాయాలు ఉన్నాయని మృతిరాలి బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మక్తల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు SI రాములు పేర్కొన్నారు.