గాజుసీసాతో భార్యను పొడిచిన భర్త

by Anukaran |   ( Updated:2020-07-15 05:22:27.0  )
గాజుసీసాతో భార్యను పొడిచిన భర్త
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురాలో దారుణం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య సవితను కడతేర్చేందుకు యత్నించాడు. కల్లుతాగిన సీసాను పగులగొట్టి.. అదే గాజుసీసాతో తన భార్యపై దాడి చేశాడు. నాలుగు ఐదు సార్లు పోట్లు పొడవడంతో బాధితురాలు కుప్పకూలిపోయింది. ఈ దాడిపై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు సవిత (28) చికిత్స పొందుతుంది.

Advertisement

Next Story

Most Viewed