- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య హత్య.. భర్త జైలుకు అనాథలైన పిల్లలు
దిశ, వెబ్ డెస్క్: భార్యపై భర్తకు వచ్చిన అనుమానం మూలంగా పిల్లలు ఆనాథలు అయ్యారు. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. కేరళకు చెందిన సీఎస్ ఉగేష్(44), విద్యా చద్రన్(40) భార్యాభర్తలు. ఉగేష్ కేరళలో ఉద్యోగం చేస్తూ, నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే విద్య దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. విద్య మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని ఉగేష్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లి, ఆమె వర్క్ చేస్తున్న ఆఫీసుకు వెళ్లి గొడవ పడ్డాడు. ఆఫీసులో గొడవ చేయోద్దంటూ ఆమె అంటున్నా ఉగేష్ ఆగలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగేష్ కత్తితో విద్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఉగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. విచారణ అనంతరం జడ్జి ఉగేష్‌కు జీవిత ఖైదు(25ఏండ్లు జైలు) విధించారు. ఈ తీర్పుపై విద్య కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు పోవడంతో వారి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.