- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపు చెట్టుకింద కూర్చుదాం అన్న భర్త.. అంతలోనే..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారి ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది. జ్వరంతో బాధపడుతున్న భర్త కొవిడ్ పరీక్ష చేయించుకుంటానంటే వెంట వెళ్లింది. నెగిటివ్ వచ్చిందని తెలియగానే సంతోషించింది. కాసేపు చెట్టు కింద సేదతీరదామని భర్త అంటే ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. అంతలోనే అతను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించి ఏం చేయాలో పాలుపోక గందరగోళానికి గురైంది. ఏమవుతుందో అర్థమయ్యే లోపే అతను మృతి చెందాడు. కళ్ల ముందే కట్టుకున్న వాడి ఊపిరి ఆగిపోవడం చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది.
కరోనాతో మృతి చెందాడో లేదో కానీ.. చావైనా.. బతుకైనా తనతోనేని అనుకున్న ఆ మహిళ.. తన పెనిమిటి ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఏమయ్యా.. లేవయ్యా.. ఇంటికి పోదాం పదా పిల్లలు ఎదురు చూస్తుంటారు అంటూ ఆమె రోదించిన తీరు అక్కడున్న వారి చేత కంటతడి పెట్టించింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా నిర్ధరణ పరీక్ష కోసం రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష చేయించుకున్న తర్వాత నెగిటివ్ అని తేలింది. అక్కడే ఓ చెట్టు కింద కాసేపు సేదతీరదామని కూర్చున్నాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.