- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్‌లో భార్య బిజీ… ఆ నిర్ణయంతో జైలుపాలైన భర్త
దిశ, వెబ్ డెస్క్: నిత్యం భార్య ఫోన్‌లో బిజీ అయిపోయింది. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో భార్యపై భర్తకు అనుమానం మెుదలైంది. ఆ అనుమానం పెనుభూతమై చివరికి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో భర్త భార్యను కడతేర్చాడు.ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జీసస్‌నగర్‌లో చిక్కనయ్య, కవిత దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అనంతపురంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ జీసస్‌నగర్‌లో స్థిరపడ్డాడు. దంపతులకు సంతోష్, జాహ్నవి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో మూడో వ్యక్తి వీరి కుటుంబంలో చిచ్చురేపాడు.
కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు ఇటీవల తరచూ ఫోన్‌చేసి మాట్లాడుతున్నాడు. గత ఏడాదిలో కరోనా వ్యాప్తి చెందటంతో పాఠశాలలు మూసి వేశారు. దీంతో కవిత ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఆరు నెలల తర్వాత భర్త వెళ్లి అనంతపురానికి తీసుకొచ్చాడు. తరచూ ఫోనులో మాట్లాడటంతో గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. అయినప్పటికీ భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బుధవారం రాత్రి భార్యభర్తలు గొడవ పడ్డారు. గురువారం తెల్లవారుజామున కూడా మళ్లీ గొడవ పడ్డారు. కోపంతో భర్త అక్కడే ఉన్న లుంగీని గొంతుకు బిగించి చంపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.