- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యపై అనుమానం.. అర్ధరాత్రి అక్కడికి తీసుకెళ్లి దారుణం చేసిన భర్త
దిశ, వెబ్‌డెస్క్ : అనుమానంకు మించిన పెను భూతం లేదంటారు. ఎంత ప్రేమ ఉన్నా చిన్న పాటి అనుమానం ఆ ప్రేమను చంపేస్తుంది. అయితే అదే విధంగా ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని.. చిన్న అనుమానంతో భర్త హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఆయనూరుకు చెందిన కౌసర్ ఫిజా అనే యువతిని అదే గ్రామానికి చెందిన షోయబ్ గత కొంత కాలంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి స్నేహం మారింది. దీంతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు వీరి సంసారం చాలా అన్యోన్యంగా సాగింది.
పెళ్లై ఆరు నెలల తర్వాత నుంచి వీరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలైంది. తర్వాత ఒక రోజు షోయబ్ తన భార్య కౌసర్‌ను దారుణంగా హత్య చేశాడు. రాత్రి సమయంలో ఎవరూ లేని సమయం చూసి షోయబ్ తన భార్య ను నగరానికి దూరంగా మారుమూల ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడే భార్యను హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం రోజున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనుమానమే హత్యకు కారంణమని పోలీసులు భావిస్తున్నారు.