Breaking News: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

by Sumithra |   ( Updated:2021-05-26 21:38:52.0  )
Breaking News: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
X

దిశ, కోదాడ : జాతీయ రహదారి 65 పై సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మాధవరం గ్రామానికి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. మునగాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని సాలార్జంగ్‌పేట ప్రాంతానికి చెందిన గాదరి ఫ్రాన్సిస్ (56), యల్లమ్మ (53)లు సూర్యాపేటలోని వారి బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఇదిలా ఉండగా.. వారి మరణానికి కారణమైన వాహనం గురించి ఇంకా తెలియరాలేదు. ఈ విషయంలో మునగాల ఏఎస్ఐ చిన మల్సూరు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story