- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పడక గదిలో భార్య అలా చేసిందని.. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త
దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తలంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. కష్టాన్నైనా, సుఖమైనా ఇద్దరూ సమానంగా ఆస్వాదిస్తూ ముందుకెళ్లాలి. అప్పుడే వారి జీవితానికి ఓ అర్థముంటుంది. కానీ, ఈరోజుల్లో చిన్నచిన్న గొడవల కారణంగా విడిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది భార్యాభర్తలు. వాస్తవానికి ఏ ఇంటిలోనైనా, ఎవరి జీవితంలోనైనా సమస్యలు అనేటివి కామన్. కానీ, వాటి పరిష్కారం వైపు ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చెన్నైలో కూడా ఇటీవల ఓ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా సంగిరి సమీపంలో నివసించే కార్తీక్(31), ప్రియ(28) భార్యాభర్తలు. వీరికి వివాహమై ఏడాదవుతోంది. అయితే, కాంట్రాక్ట్ పనులు చేసుకునే కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలయ్యేవి. ఈ క్రమంలో ఇటీవల వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆమె ఆరోజు రాత్రి తన పడక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే లేచి చూసిన భర్త కార్తీక్ బోరన విలపించాడు. అనంతరం తాను కూడా అక్కడే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, అతని బంధువులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- chennai