దొంగల బీభత్సం.. హనుమాన్ ఆలయంలో హుండీ బద్దలు..

by Sumithra |
hanuman-temple 1
X

దిశ, గద్వాల : కరోనా సమయం, రాత్రి వేళల్లో కర్ఫ్యూ కొనసాగుతుండటంతో ఆలయాలన్నీ భక్తులు లేక బోసిపోయి దర్శనమిస్తున్నాయి. అదే అదనుగా భావించిన దొంగలు రెచ్చిపోయారు. హనుమాన్ ఆలయంలో హుండీ బద్దలు కొట్టి నగదు అపహరించారు. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పట్టణ శివారు పిల్లిగుండ్ల కాలనీలో శనివారం రాత్రి వెలుగుచూసింది. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి కృష్ణ సాగర్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పూజారి కథనం ప్రకారం.. గత రాత్రి గుడి తలుపులు మూసి తిరిగి ఆదివారం ఉదయం గుడి తలుపులు తెరవడానికి వెళ్లగా అప్పటికే తాళాలు పగులకొట్టి ఉండటంతో పాటు అక్కడే వున్న హుండీ బద్దలు గొట్టి కనిపించిందన్నారు. అందులోని నగదు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దొంగలించారని తెలిపారు. హుండీలో మొత్తం రూ.10వేల నగదు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed