‘హమ్మర్’ కారు నడిపిన US ప్రెసిడెంట్ ‘జో బైడెన్’.. ఆయన ఫన్నీ కామెంట్స్ మీకోసం..!

by vinod kumar |
Joe biden
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ‘వైట్ అండ్ బ్లాక్’ బీస్ట్ హమ్మర్ కారును డ్రైవర్ చేశారు. USలోని డెట్రాయిట్ రాష్ట్రంలో గల MG (జనరల్ మోటార్స) ప్లాంట్‌లో ఆయన హమ్మర్ కారెక్కి రౌండ్స్ వేశారు. ఆయన నడిపిన కారు పూర్తిగా ఎలక్ట్రిక్ తయారీ అని జనరల్ మోటార్స్ ప్రకటించింది. అయితే, బైడెన్ కారు డ్రైవ్ చేస్తు్న్న సమయంలో సరదాగా కామెంట్స్ చేశారు. కారు వెనుక భాగం కార్గో స్పేస్‌లో ఎక్కాలనుకుంటున్నారా? రూఫ్ పై ఎవరైనా జంప్ చేయాలనుకుంటున్నారా? అని అడిగారు.

ఆయన కారు నడపడంలో గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. జనరల్ మోటార్స్ EV ఎలక్ర్టిక్ విభాగంలో వన్ ట్రిలియన్ డాలర్స్ (రూ.వెయ్యి కోట్లు) పెట్టుబడి లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని అధికారులు ప్రకటించారు. అమెరికాలో భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం పనిచేయనుందని బైడెన్ తెలిపారు. అందుకోసమే జనరల్ మోటార్స్ తయారు చేసిన హమ్మర్ కారును ప్రెసిడెంట్ బైడెన్ డ్రైవ్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story