హెచ్‌యూఎల్ అరుదైన నిర్ణయం!

by Harish |   ( Updated:2020-06-25 04:46:12.0  )
హెచ్‌యూఎల్ అరుదైన నిర్ణయం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ అరుదైన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా జాతి వివక్షపై జరుగుతున్న చర్చలను గమనిస్తున్న హిందూస్తాన్ యూనిలీవర్ సంస్థ ప్రధాన ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించనున్నట్టు వెల్లడించింది. త్వరలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తర్వాత దీన్ని రీ బ్రాండింగ్ చేస్తామని, ఫెయిర్ అండ్ లవ్లీ ఉత్పత్తుల మీద ఫెయిర్‌నెస్, వైట్‌నింగ్, లైట్‌నింగ్ పదాలను తొలగించేలా నిర్ణయం తీసుకున్నామని హెచ్‌యూల్ ఎండీ, ఛైర్మన్ సంజీవ్ మెహతా ప్రకటించారు. అంతేకాకుండా ఫెయిర్ అండ్ లవ్లీ ఉత్పత్తులపై ముద్రించే రెండు ముఖాల్లో నల్లగా ఉన్న ముఖాన్ని తొలగిస్తున్నామన్నారు. దశాబ్దం క్రితం మహిళల సాధికారత సందేశాన్నిస్తూ ప్రకటనలు తెచ్చామని, అప్పట్లో ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించిందన్నారు. మారిన పరిస్థితులను అనుసరించి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పలు స్కిన్‌టోన్లను కలిగిన మహిళలను గౌరవించేలా ప్రకటనలతో ముందుకొస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా, ఇటీవల ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను ఆపేస్తున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన తక్కువ సమయంలో హెచ్‌యూఎల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed