HYDలో పిల్లి మిస్సింగ్.. ఆచూకీ చెబితే భారీ రివార్డ్

by Shyam |   ( Updated:2021-07-13 08:36:28.0  )
HYDలో పిల్లి మిస్సింగ్.. ఆచూకీ చెబితే భారీ రివార్డ్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: మనుషులు కనిపించకుండా పోతేనే పట్టించుకోని ఈ రోజుల్లో తన పిల్లి తప్పిపోయిందంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఏకంగా హైదర్ గూడలోని ఎన్ ఎస్ ఎస్ లో ప్రెస్ మీట్ పెట్టింది. తన పిల్లి ఆచూకి తెలిపిన వారికి రూ.30 వేల నగదు పారితోషికం ప్రకటించింది. టోలీచౌకీ ప్రాంతానికి చెందిన సెరీనా స్వతహాగా జంతు ప్రేమికురాలు. చిన్నతనం నుండి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతుంది. గత ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని అడాప్ట్ చేసుకుంది.

సెరీనా అప్పటి నుండి జింజర్ ను ప్రేమగా పెంచుకుంటుంది. కరోనా నేపథ్యంలో పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్ లోని పెట్ క్లినిక్ లో జూన్ 17న సర్జరీ చేయించింది. స్టిచెస్ వేసిన చోట స్వేల్లింగ్ రావడంతో తిరిగి జూన్ 23న అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అయితే, అక్కడే ట్రీట్మెంట్ పొందుతున్న సదరు పిల్లి జూన్ 24న హాస్పిటల్ నుండి తప్పిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహించిన సెరీనా పోలీసులను ఆశ్రయించింది.

పిల్లి తప్పిపోయిన విషయంపై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెంట్స్
సైతం పంచి పెట్టింది. అయినా ఫలితం లేకుండాపోవడంతో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి తన పిల్లి ఆచూకీ కోసం గత 20 రోజులుగా వెతుకుతున్నా లాభం లేకపోయిందని వాపోయింది. పిల్లి ఆచూకీ తెలిపిన
వారికి రూ.30 వేల రివార్డును ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed